ప్రసార భారతి కొత్త చైర్మన్గా ప్రసూన్ జోషి!
ప్రసార భారతి కొత్త చైర్మన్గా ప్రసూన్ జోషి!
prasoon joshi


న్యూఢిల్లీ, 03 మే (హి.స.)

ప్రముఖ సినీ గీత రచయిత, కేంద్ర సెన్సార్ బోర్డు మాజీ చైర్మన్ ప్రసూన్ జోషికి కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రసార భారతి చైర్మన్గా ఆయన్ను నియమిస్తూ భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ పదవిలో ఉన్న నవనీత్ కుమార్ సెహగల్ రాజీనామా చేయడంతో, ఆ ఖాళీని ప్రసూన్ జోషితో భర్తీ చేయబోతున్నాడు. కేవలం చిత్ర పరిశ్రమలోనే కాకుండా అడ్వర్టైజింగ్ మరియు కమ్యూనికేషన్ రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జోషి, మెక్కాన్ వరల్డ్ గ్రూప్ ఇండియాకు సీఈఓగా కూడా వ్యవహరించారు. రంగ్ దే బసంతి’, ‘తారే జమీన్ పర్’ వంటి చిత్రాలతో జాతీయ అవార్డులను, భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు జోషి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande