స్మార్ట్’పై సమరం
స్మార్ట్’పై సమరం
smart


అకోలా, 03 మే (హి.స.)

స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి. మీటర్లు వద్దంటూ ఆగ్రా జిల్లాలోని మహిళలు నిరసన ప్రదర్శన చేపట్టారు. మీటర్లను నెత్తి మీద పెట్టుకొని అకోలాలోని దేవీ మందిరం నుంచి స్థానిక విద్యుత్తు కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. స్మార్ట్ మీటర్లను అమర్చినప్పటి నుంచి కరెంటు బిల్లులు విపరీతంగా వస్తున్నాయని మండిపడ్డారు. బిల్లులు చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు సరఫరాలోనూ తరుచుగా సమస్యలు ఎదురవుతున్నట్టు పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించి వాటి స్థానంలో పాత మీటర్లను పెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande