సాంకేతిక లోపంతో వెనుదిరిగిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం; కన్నూర్ ఎయిర్పోర్ట్లో సురక్షిత ల్యాండింగ్
సాంకేతిక లోపంతో వెనుదిరిగిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం; కన్నూర్ ఎయిర్పోర్ట్లో సురక్షిత ల్యాండింగ్
Air Plane


కన్నూర్, 16 జూన్ (హి.స.)కేరళలోని కన్నూర్ అంతర్జాతీయ

విమానాశ్రయం నుండి సౌదీ అరేబియాలోని జెడ్డాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్

విమానం సాంకేతిక లోపం కారణంగా వెనుదిరిగింది.విమానం టేకాఫ్ అయిన రెండు గంటల

వ్యవధిలోనే పైలట్లు ఈ లోపాన్ని గుర్తించి, తిరిగి కన్నూర్ ఎయిర్పోర్ట్కు

మళ్లించాలని నిర్ణయించారు. విమానంలో ఉన్న180 మందికి పైగా ప్రయాణికులుఎలాంటి ప్రమాదం లేకుండా

సురక్షితంగా ల్యాండ్ అయ్యారని విమానాశ్రయ వర్గాలు ధృవీకరించాయి.

ఈ విమానం మంగళవారం ఉదయం 7:40 గంటలకు కన్నూర్ నుండి జెడ్డాకు

బయలుదేరింది. అయితే ప్రయాణంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో, విమాన ఇంధన భారాన్ని

తగ్గించుకోవడానికి (Fuel Burning) ఆకాశంలో కాసేపు వలయాకారంలో వట్టమిట్టు ప్రయాణించి, ఆపై సురక్షితంగా రన్వేపై

ల్యాండ్ అయింది. ఈ సాంకేతిక సమస్యకు గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి ఎయిర్

ఇండియా ఇంజనీరింగ్ బృందం విమానాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ప్రయాణికులకు

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంపై ఎయిర్లైన్స్ యాజమాన్యం దృష్టి సారించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande