బిడాడి టౌన్షిప్ ప్రాజెక్ట్ను సమర్థించిన కర్ణాటక సీఎండి.కె. శివకుమార్; సొంత పార్టీ మంత్రి నుంచే వ్యతిరేకత
బిడాడి టౌన్షిప్ ప్రాజెక్ట్ను సమర్థించిన కర్ణాటక సీఎండి.కె. శివకుమార్; సొంత పార్టీ మంత్రి నుంచే వ్యతిరేకత
DK Shivakumar


బెంగళూరు, 16 జూన్ (హి.స.)

ప్రతిపాదిత బిడాడి స్మార్ట్

టౌన్షిప్ ప్రాజెక్ట్పై వస్తున్న విమర్శలను కర్ణాటక ముఖ్యమంత్రిడి.కె. శివకుమార్తీవ్రంగా ఖండించారు. బెంగళూరు నగరంపై పెరుగుతున్న

ఒత్తిడిని తగ్గించడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్ తానేమీ కొత్తగా తెచ్చింది కాదని, గతంలో హెచ్.డి. కుమారస్వామి

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీనికి పునాది పడిందని ఆయన స్పష్టం చేశారు. సుమారు 7,481 ఎకరాల విస్తీర్ణంలో

నిర్మించతలపెట్టిన ఈ 'గ్రేటర్ బెంగళూరు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్' భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత టౌన్షిప్ కాబోతోందని సీఎం పేర్కొన్నారు.

ఇటీవల

ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ప్రాజెక్ట్ ఆలోచనను

అభినందించారని శివకుమార్ వెల్లడించారు.అయితే, ఈ ప్రాజెక్ట్ కోసం రైతుల నుంచి

భారీగా భూసేకరణ చేస్తుండటంతో విపక్షాల నుంచే కాకుండా సొంత కాంగ్రెస్ పార్టీ నుంచి

కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కర్ణాటక ప్రజాపనుల శాఖ (PWD) మంత్రి సతీష్ జార్కిహోళి ఈ

ప్రాజెక్ట్పై బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేశారు. భూములు కోల్పోతున్న రైతుల

అసంతృప్తి తీవ్రరూపం దాల్చకముందే ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలని, ప్రాజెక్ట్ వల్ల పార్టీ

ప్రతిష్ట దెబ్బతినకూడదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వివాదాస్పద అంశంపై జూన్ 20న జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ (Cabinet) సమావేశంలో సమగ్రంగా

చర్చించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande