
న్యూఢిల్లీ, 16 జూన్ (హి.స.)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి
స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారమైన 'ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్
క్రాస్' (ఫస్ట్ క్లాస్) లభించింది.ఒక భారతీయ ప్రధాని ఈ దేశాన్ని
సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. భారత్-స్లోవేకియా ద్వైపాక్షిక సంబంధాలను
బలోపేతం చేయడంలో, ప్రపంచ నాయకత్వంలో మోదీ అందించిన కృషికి గుర్తింపుగా
స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని బ్రాటిస్లావాలో ఈ ప్రతిష్టాత్మక
అవార్డును అందజేశారు. ప్రధాని మోదీకి విదేశీ దేశాలు అందించిన33వ అంతర్జాతీయ గౌరవంఇది. ఈ ప్రకటన తర్వాత లోక్సభ
స్పీకర్ ఓం బిర్లా, భారతీయ జనతా పార్టీ (BJP) అగ్రనాయకులు ప్రధానికి
అభినందనలు తెలిపారు. ఈ పురస్కారం భారతదేశ పెరుగుతున్న అంతర్జాతీయ ప్రభావానికి, ప్రధాని దూరదృష్టితో కూడిన
నాయకత్వానికి నిదర్శనమని వారు కొనియాడారు.
విదేశీ పౌరులకు మాత్రమే ఇచ్చే ఈ
సివిల్ టైప్ పతకాన్ని అందుకున్న అనంతరం ప్రధాని మోదీ దీనిని140 కోట్ల మంది భారతీయ ప్రజలకు
అంకితంచేశారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న గాఢమైన నమ్మకానికి, స్నేహానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.
ఈ పర్యటనలో భాగంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశంలో
ఆర్థిక సహకారాన్ని పెంపొందించేందుకు కార్మిక వలసలు, డిజిటల్ సాంకేతికతపై కీలకఅవగాహన ఒప్పందాల (MoUs) పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
అలాగే అధ్యక్ష భవనంలో జరిగిన సమావేశాలలో పరస్పర వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ సహకారం, అణుశక్తి మరియు సాంస్కృతిక
మార్పిడిని విస్తరించడంపై వ్యూహాత్మక చర్చలు జరిపారు.
ఈ చారిత్రాత్మక విజయంపై లోక్సభ
స్పీకర్ ఓం బిర్లా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ X ద్వారా ప్రధానికి అభినందనలు
తెలియజేస్తూ.. ఈ పురస్కారం ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క పెరుగుతున్న స్థాయిని, శాంతి కోసం దేశం పోషిస్తున్న
పాత్రను తెలియజేస్తుందని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా ఇది
యావత్ దేశానికి గర్వకారణమైన క్షణమని, 33వ అంతర్జాతీయ పురస్కారం మానవాళి
సంక్షేమం కోసం పీఎం మోదీ చేస్తున్న కృషిని నిరూపిస్తోందని అన్నారు. కేంద్ర
మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్
తదితర నేతలు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ నిరంతర అంతర్జాతీయ గౌరవాలు నవభారత్ దౌత్య విధానాలపై
ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకానికి అద్దం పడుతున్నాయని కొనియాడారు. ఈ మూడు రోజుల
పర్యటన సెంట్రల్ యూరప్లో భారతదేశ దౌత్య ముద్రను మరింత బలోపేతం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi