కేదార్నాథ్ యాత్రికులకు అలర్ట్: రుద్రప్రయాగ్ యంత్రాంగం కీలక హెచ్చరికలు
కేదార్నాథ్ యాత్రికులకు అలర్ట్: రుద్రప్రయాగ్ యంత్రాంగం కీలక హెచ్చరికలు
kedarnath


కేదార్నాథ్, 16 జూన్ (హి.స.)ఉత్తరాఖండ్లో

రుతుపవనాల రాకతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, కేదార్నాథ్ యాత్రికులు

అప్రమత్తంగా ఉండాలని రుద్రప్రయాగ్ జిల్లా కలెక్టర్ (DM) విశాల్ మిశ్రా అధికారిక

హెచ్చరికలు జారీ చేశారు

. ఏప్రిల్ 22న ప్రారంభమైన ఈ ఏడాది కేదార్నాథ్

యాత్రలో ఇప్పటివరకు12 లక్షలకు పైగా భక్తులుస్వామివారిని దర్శించుకున్నారని

ఆయన వెల్లడించారు. పర్వత ప్రాంతాలలో వర్షాల తీవ్రత క్రమంగా పెరుగుతున్నందున, భక్తుల భద్రత దృష్ట్యా కంట్రోల్

రూమ్ ద్వారా ట్రాఫిక్, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు, మరియు ఆలయ పరిసరాలను సిసిటివి

కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

రైన్కోట్లు, గొడుగులు వెంట తెచ్చుకోవాలని, దీర్ఘకాలిక

ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తగిన మందులు తమతో ఉంచుకోవాలని యంత్రాంగం సూచించింది.

యాత్ర మార్గంలో సిరోబగడ్, బన్స్వారా, జామూ, ముంకటియా వంటి ప్రాంతాలను అత్యంత ప్రమాదకరమైన కొండచరియలు

విరిగిపడే వలయాలుగా గుర్తించారు. అదేవిధంగా, కాలినడకన వెళ్లే మార్గంలో కుబేర్ గ్లేసియర్, రాంబారా, భీంబలి, లించోలి

ప్రాంతాలను డేంజర్ జోన్లుగా ప్రకటించి అక్కడ విపత్తు నిర్వహణ, రెస్క్యూ

టీమ్లను (NDRF, SDRF) హై అలర్ట్లో ఉంచారు. ప్రయాణికులు ప్లాస్టిక్ వాడకాన్ని

నివారించి, పరిశుభ్రత పాటించాలని, అధికారులు ఇచ్చే వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు

గమనిస్తూ సహకరించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande