
హైదరాబాద్, 25 జూన్ (హి.స.)
గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి బిడ్డకు 100 శాతం పాఠశాల ప్రవేశం కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన 24వ 'కన్యా కేలవణి మహోత్సవం మరియు శాలా ప్రవేశోత్సవం-2026' ఘనంగా ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ బృహత్తర కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడిన సుమారు 60,184 మంది ప్రముఖులు 17,338 గ్రామాల్లోని 24,716 పాఠశాలలను సందర్శించి పిల్లలకు సాదర స్వాగతం పలికారు. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 11.20 లక్షల మందికి పైగా విద్యార్థులు పాఠశాలల్లో నమోదు చేసుకున్నారు. ఇందులో అంగన్వాడీలు, కిండర్గార్టెన్లలో 62,000 మందికి పైగా పిల్లలు చేరగా, బాలవాటికలో 1.40 లక్షల మంది, ఒకటో తరగతిలో 34,000 మందికి పైగా విద్యార్థులు ప్రవేశం పొందారు. అంతేకాకుండా, 'బ్యాక్ టు స్కూల్ సర్వే' ద్వారా చదువు మధ్యలో ఆపేసిన 21,892 మంది విద్యార్థులు తిరిగి పాఠశాలల్లో చేరారు. బాలికల ఉన్నత విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించడానికి 5,664 మంది ప్రతిభావంతులైన విద్యార్థినులకు 'విద్యా లక్ష్మి బాండ్లు' పంపిణీ చేశారు. ప్రజలు సైతం ఈ విద్యా యజ్ఞంలో భాగస్వాములవుతూ సుమారు రూ. 9.19 కోట్ల విలువైన నగదు, విద్యా సామాగ్రిని విరాళంగా అందించడం విశేషం
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi