
కోల్కతా, 25 జూన్ (హి.స.)
కోల్కతాలోని తారాతలా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక గోదాము షెడ్ కూలిపోయిన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన ఎనిమిది మంది కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి రూ. 2 లక్షల చొప్పున, అలాగే గాయపడిన 20 మందికి రూ. 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తామని పీఎంఓ ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాద స్థలంలో ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టగా, క్షతగాత్రులను ఎస్ఎస్కేఎమ్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారికి అవసరమైన అన్ని సహాయసహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి బిల్డింగ్ సూపర్వైజర్, ఇద్దరు లేబర్ సప్లయర్లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జయసూర్య ముఖర్జీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi