ప్రధాని మోదీ సీషెల్స్ పర్యటన: జాతీయ దినోత్సవ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు హాజరు
ప్రధాని మోదీ సీషెల్స్ పర్యటన: జాతీయ దినోత్సవ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు హాజరు
PM Modi  at G7 Summit


ఢిల్లీ, 27 జూన్ (హి.స.)

భారత

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశంలో మూడు రోజుల అధికారిక పర్యటన కోసం

శనివారం ఉదయం ఢిల్లీ నుండి బయలుదేరారు. సీషెల్స్ దేశ స్వాతంత్ర్యం పొంది 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా

నిర్వహిస్తున్న జాతీయ దినోత్సవ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా

పాల్గొననున్నారు. సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ ఆహ్వానం మేరకు

జరిగిన ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య రక్షణ, సముద్ర

భద్రత, ఆర్థిక

సహకారంపై కీలక చర్చలు జరగనున్నాయి. ఈ చారిత్రాత్మక పరేడ్లో పాల్గొనడానికి భారత

సాయుధ దళాల బృందంతో పాటు, రెండు

భారత నౌకాదళ యుద్ధనౌకలు ఇప్పటికే సీషెల్స్ చేరుకున్నాయి. భారత్-సీషెల్స్ దౌత్య సంబంధాలకు

50

ఏళ్లు పూర్తయిన తరుణంలో జరుగుతున్న ఈ పర్యటనలో భాగంగా, సీషెల్స్ జాతీయ అసెంబ్లీని

ఉద్దేశించి ప్రసంగించనున్న మొదటి భారత ప్రధానమంత్రిగా మోదీ నిలవనున్నారు. 2015 తర్వాత 11 ఏళ్ల విరామం అనంతరం ప్రధాని మోదీ

మళ్లీ ఆ దేశాన్ని సందర్శిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande