ఖండ్వాలో అక్రమ ఇళ్ల తొలగింపు చర్యలు: అటవీ శాఖ సిబ్బందిపై గ్రామస్తుల దాడి, ఎనిమిది మందికి గాయాలు
ఖండ్వాలో అక్రమ ఇళ్ల తొలగింపు చర్యలు: అటవీ శాఖ సిబ్బందిపై గ్రామస్తుల దాడి, ఎనిమిది మందికి గాయాలు
ఖండ్వాలో అక్రమ ఇళ్ల తొలగింపు చర్యలు: అటవీ శాఖ సిబ్బందిపై గ్రామస్తుల దాడి, ఎనిమిది మందికి గాయాలు


భోపాల్:, 29 జూన్ (హి.స.) మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలను అడ్డుకోవడానికి వెళ్లిన అటవీ శాఖ ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంపై అక్రమ ఆక్రమణదారులు లాఠీలు, వడిసెలు, రాళ్లతో దాడిచేశారు ఖండ్వా జిల్లా గూడి రేంజ్ పరిధిలోని ఆమాఖుజారి అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ హింసాత్మక ఘటనలో కనీసం ఎనిమిది మంది అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఖండ్వా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఇటీవల కురిసిన రుతుపవనాల వర్షాల తర్వాత అటవీ భూమిలో జరుగుతున్న అక్రమ సాగును, ఆక్రమణలను నిలిపివేయడానికి అటవీ శాఖకు చెందిన 40 మంది సభ్యుల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఆమాఖుజారి ప్రాంతానికి చేరుకుంది. ఈ క్రమంలో దాదాపు 400 మందికి పైగా ఉన్న ఆక్రమణదారులు అటవీ అధికారులను అడ్డుకున్నారు. ముందు వరసలో మహిళలను నిలబెట్టి, వారి వెనుక నుంచి పురుషులు వడిసెలలతో రాళ్లు రువ్వుతూ, కర్రలతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారని బాధితులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరికి తలపై తీవ్ర గాయాలు కాగా, ఒక సిబ్బంది చెవి పాక్షికంగా తెగిపడింది. దాడి జరిగిన దాదాపు రెండు గంటల వరకు పోలీసు బలగాలు కానీ, అంబులెన్స్ కానీ ఘటనా స్థలానికి చేరుకోలేదని, తమకు సకాలంలో సహాయం అందలేదని అటవీ సిబ్బంది ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డ్రోన్ విజువల్స్ మరియు సాక్ష్యాధారాల ఆధారంగా దాడికి పాల్పడిన నిందితులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రాంతంలో అక్రమ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande