గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. సిలిండర్పై రూ.183.50 తగ్గింపు!
గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. సిలిండర్పై రూ.183.50 తగ్గింపు!
LPG Cylinder price cut today 19 kg commercial cylinder cheaper


ఢిల్లీ, 01 జూలై (హి.స.)గ్యాస్ సిలిండర్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీన గ్యాస్ వినియోగదారులకు గుడ్న్యూస్ తెలిపింది. సిలిండర్ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను రూ.183.50 తగ్గించింది. ఈ తగ్గింపు తర్వాత గతంలో రూ.3,113.50గా ఉన్న దాని ధర ఇప్పుడు రూ.2,930కి చేరింది. 14.2 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.

ఈ సంవత్సరం తొలిసారిగా వాణిజ్య సిలిండర్ల ధర తగ్గింది. జనవరి 2026లో ఢిల్లీలో దీని ధర రూ. 1691.50 ఉండగా, జూన్ నాటికి అది దాదాపు రెట్టింపు అయింది. మార్చి 2026లో దీని ధరలు రెండుసార్లు పెరిగాయి. మార్చి 1న వాణిజ్య సిలిండర్ ధర రూ. 28 పెరగగా, మార్చి 7న అది రూ. 114.50 పెరిగింది. మే నెలలో దీని ధర ఏకంగా రూ. 993 పెరగడంతో ఢిల్లీలో ధర నేరుగా రూ. 3071.50కి చేరింది. జూన్ 1న ఇది రూ. 42 పెరిగింది.

ఈరోజు ధరల తగ్గింపు తర్వాత న్యూఢిల్లీలో 19 కిలోగ్రాముల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.2,930కి తగ్గింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే నిన్నటి వరకు కూడా కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,105.50 నుంచి 2,321 వద్ద ఉండేది. తాజా తగ్గింపుతో రూ. 2000 వేల దిగువకు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (SAED) లీటరుకు రూ.1.5 నుండి రూ.4కు పెంచింది. ఈ చర్య జూలై 1 నుండి అమల్లోకి వస్తుంది.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు గృహ వినియోగ సిలిండర్లపై రూ. 89 భారం పడగా, ఈ నెలలో ధరలను పెంచకుండా యథాతథంగా ఉంచడం సామాన్యులకు కొంతవరకు ఉపశమనం కలిగించే విషయమేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande