బిజెపి ఎంపీ రాఘవ్ చద్దాపై ఉన్న ఐదు పరువు నష్టం కలిగించే సోషల్ మీడియా పోస్టులను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు  ఆదేశం
బిజెపి ఎంపీ రాఘవ్ చద్దాపై ఉన్న ఐదు పరువు నష్టం కలిగించే సోషల్ మీడియా పోస్టులను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు  ఆదేశం
delhi


ఢిల్లీ , 01 జూలై (హి.స.)

రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు సంబంధించిన పరువు నష్టం కలిగించే సోషల్ మీడియా పోస్టులను వెంటనే తొలగించాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం సామాజిక మాధ్యమ వేదికలను ఆదేశించింది. జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్తో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈ తాత్కాలిక ఉత్తర్వులను జారీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నుండి భారతీయ జనతా పార్టీ (BJP) లోకి ఆయన మారిన నేపథ్యంలో, ఆయనను లక్ష్యంగా చేసుకుని ప్రచారంలోకి తెచ్చిన కొన్ని కంటెంట్లు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని కోర్టు ప్రాథమికంగా అంగీకరించింది. చద్దా డబ్బుకు అమ్ముడుపోయినట్లుగా చిత్రీకరిస్తూ రూపొందించిన ఏఐ (AI) డీప్ఫేక్లు, మార్ఫింగ్ వీడియోలు మరియు తప్పుడు ప్రసంగాలను అంతర్జాలం నుండి తొలగించాలని స్పష్టం చేసింది.అయితే, ఈ పిటిషన్లో రాఘవ్ చద్దా కోరినట్లుగా పూర్తి స్థాయి 'బ్లాంకెట్ నిషేధం' (Blanket Order) విధించడానికి మరియు 'వ్యక్తిత్వ హక్కుల' (Personality Rights) రక్షణను కల్పించడానికి హైకోర్టు నిరాకరించింది. ఒక వ్యక్తి రాజకీయ నిర్ణయాన్ని విమర్శించే హక్కు పౌరులకు ఉంటుందని, రాజకీయ విమర్శలకు మరియు పరువు నష్టానికి మధ్య చాలా సన్నని గీత ఉంటుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఆర్కే లక్ష్మణ్ కార్టూన్ల వంటి వ్యంగ్య విమర్శలను చూస్తూ పెరిగామని, ప్రజా జీవితంలో ఉండే రాజకీయ నాయకులు విమర్శల పట్ల అంత సున్నితంగా ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది. చద్దా తరపున సీనియర్ అడ్వకేట్ రాజీవ్ నాయర్ వాదనలు వినిపించగా, కోర్టు ఆ ఐదు పత్రాలు మినహా మిగిలిన కంటెంట్ ఏదీ ప్రాథమికంగా పరువు నష్టం కలిగించేదిగా లేదని తేల్చిచెప్పింది

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande