వాహనదారులకు ఊరట.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన నయారా..!
వాహనదారులకు ఊరట.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన నయారా..!
nayara


హైదరాబాద్, 01 జూలై (హి.స.)

దేశంలోని వాహనదారులకు నయారా ఎనర్జీ (Nayara Energy) భారీ ఊరట కల్పించింది. పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలను తగ్గించింది. పెట్రోల్పై లీటర్కు రూ.5, డీజిల్పై లీటర్కు రూ.3 చొప్పున కోత విధించింది. దేశవ్యాప్తంగా ఉన్న 7,000కు పైగా నయారా రిటైల్ ఔట్లెట్ల (Nayara Retail Oulets) లో ఈ తగ్గిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. గత రెండేళ్లలో దేశంలో ఒక ఇంధన రిటైల్ సంస్థ ధరలను తగ్గించడం ఇదే తొలిసారి. పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు చల్లారడం, కీలకమైన సముద్ర మార్గాలు తిరిగి తెరుచుకోవడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి.ఈ నేపథ్యంలోనే నయారా ఎనర్జీ పెట్రో ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రాల వారీగా ఉండే వ్యాట్ వంటి స్థానిక పన్నుల కారణంగా తుది రిటైల్ ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. నయారా ధరలను తగ్గించినప్పటికీ, ప్రభుత్వరంగ చమురు సంస్థలు మాత్రం పాత ధరలనే కొనసాగిస్తున్నాయి. దేశంలోని 90 శాతానికిపైగా ఇంధన మార్కెట్ను నియంత్రించే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్ ) తమ ధరలలో ఎటువంటి మార్పు చేయలేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande