
అహ్మదాబాద్, 15 జూలై (హి.స.)
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తు తుది దశకు చేరిందని కేంద్ర పౌర విమానమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. అతి త్వరలోనే ఈ ప్రమాదానికి సంబంధించిన తుది నివేదిక వస్తోందని పేర్కొన్నారు. త్వరగా నివేదిక ఇవ్వడం కంటే.. ప్రమాదం అసలు నిజాన్ని బయటపెట్టడమే తమకు ముఖ్యమని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గతేడాది జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఇండియా AI-171 బోయింగ్ విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi