
కమర్హతి , 15 జూలై (హి.స.)
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో పెను సంచలనం నమోదైంది. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి కోలుకోలేని విధంగా గట్టి షాక్ తగిలింది. టీఎంసీలో కీలక నేత, మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే మదన్ మిత్ర పార్టీకి గుడ్‌బై చెప్పారు. రీతాబ్రతా బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు టీఎంసీ వర్గంలో ఆయన చేరడం బెంగాల్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
వన్‌మ్యాన్ షోగా మారిన తృణమూల్.. మదన్ మిత్ర సంచలన వ్యాఖ్యలు
కమర్హతి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మిత్ర పార్టీని వీడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ లక్ష్యంగా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. 'పార్టీ నాశనమైపోతోంది.. పడవ మునిగిపోతోంది. ప్రజలు చనిపోతున్నారు. అయినా సరే, అభిషేక్ బెనర్జీని ఎలాగైనా కాపాడుకోవాలనే ధోరణిలోనే పార్టీ నిర్ణయాలు ఉన్నాయి. అభిషేక్ కనీసం ఆరు నెలలు లేదా ఏడాది పాటు పక్కకు తప్పుకోవాలని, పార్టీని మేము నిర్మిస్తామని స్వయంగా ఆయనకే సూచించాను. కానీ ఆయన దానికి నిరాకరించారు. పార్టీ అందరిదీ కాకుండా.. కేవలం అభిషేక్ బెనర్జీ చుట్టూనే తిరుగుతోంది.' అంటూ మదన్ మిత్ర సంచలన ఆరోపణలు గుప్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi