హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల్లో భారతీయ నావికులను నియమించవద్దు: షిప్పింగ్ సంస్థలకు కేంద్రం ఆదేశం
హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల్లో భారతీయ నావికులను నియమించవద్దు: షిప్పింగ్ సంస్థలకు కేంద్రం ఆదేశం
harmoz


న్యూఢిల్లీ, 16 జూలై (హి.స.)

:అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరియు సముద్ర దాడులు

తీవ్రమవడంతో, వ్యూహాత్మకహోర్ముజ్ జలసంధి గుండా

ప్రయాణించే వాణిజ్య నౌకల్లో భారతీయ నావికులను (Seafarers) నియమించవద్దని

కేంద్ర ప్రభుత్వం షిప్పింగ్ కంపెనీలను ఆదేశించింది. భారత

ప్రభుత్వ నౌకాయాన నియంత్రణ సంస్థ అయిన 'డైరెక్టరేట్ జనరల్

ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్' (DGMA) బుధవారం రాత్రి ఈ

అత్యవసర ఆదేశాలను జారీ చేసింది.

ఇటీవల హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో యూఏఈ

జెండాతో ప్రయాణిస్తున్న 'ఎంటీ అల్ బహియా', 'ఎంటీ

మొంబాసా' అనే రెండు నౌకలపై జరిగిన దాడుల్లో ఇద్దరు

భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా

గాయపడ్డారు. ఈ నేపథ్యంలో నావికుల ప్రాణ రక్షణే పరమావధిగా కేంద్ర ఓడరేవులు, నౌకాయాన శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ నేతృత్వంలో జరిగిన ఉన్నత

స్థాయి సమీక్షా సమావేశం అనంతరం ప్రభుత్వం'సీఫేరర్-ఫస్ట్' అత్యవసర

భద్రతా ప్రణాళికను ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు షిప్ యజమానులు,

మేనేజర్లు మరియు రిక్రూట్‌మెంట్ (RPSL) కంపెనీలు

ఎవరూ కూడా భారతీయ సిబ్బందిని ఈ ప్రమాదకర మార్గాల్లోని నౌకల్లో నియమించకూడదని

డీజీఎంఏ సర్క్యులర్ నంబర్ 36/2026 ద్వారా స్పష్టం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా 3 లక్షలకు పైగా నావికులతో భారత్ మూడో

అతిపెద్ద సరఫరాదారుగా ఉన్నందున, ఈ నిర్ణయం అంతర్జాతీయ షిప్పింగ్ రంగంపై

పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande