
న్యూఢిల్లీ, 16 జూలై (హి.స.)
: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత తీవ్రం కానున్నాయని, రాబోయే రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉందని, అలాగే గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ అధికారులు వెల్లడించారు.రుతుపవనాల కదలికలు చురుగ్గా మారడం వల్ల పశ్చిమ తీర ప్రాంతాలు, మధ్య భారతం మరియు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గోవా, కర్ణాటక తీర ప్రాంతాలతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు కేరళ రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉండాలని 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉందని, కొండ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. నదులు, వాగులు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున ప్రజలు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi