
ఎన్టీఆర్ జిల్లా,, 18 జూలై (హి.స.)
:ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీలో అత్యాధునిక చెత్త వ్యర్థాల ప్రాసెస్సింగ్ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడువర్చువల్గా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. తడి, పొడి చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో ఈ అత్యాధునిక కేంద్రం ప్రాసెస్ చేయనుంది.
పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు కీలక అడుగు పడింది. చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వ మరో ముందడుగు వేసింది. పట్టణంలో దుర్వాసనలు, వ్యాధులు, భూ-వాయు కాలుష్యాన్ని ఈ ప్లాంట్ తగ్గించనుంది. కాలుష్య రహిత, పరిశుభ్రమైన, హరిత కొండపల్లి నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. చెత్తను విలువైన వనరుగా ఆధునిక వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ మార్చనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ