
శ్రీకాకుళం, 18 జూలై (హి.స.)
, వైసీపీ నేత, మాజీమంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్ కేసులో కాశీబుగ్గ పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. విధుల్లో అలసత్వం, నిందితులకు సహకరించారన్న ఆరోపణలతో ఇద్దరు పోలీసులపై వేటు పడింది. కాశీబుగ్గ సీఐ రామకృష్ణను ఉన్నతాధికారులు వీఆర్కు పంపించారు. ఇప్పటికే ఎస్ఐ సునీల్ను వీఆర్కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. మొదటి నుంచి కాశీబుగ్గ పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డు ప్రమాద కేసులో సాక్ష్యులను తారుమారు చేయటంలో కాశీబుగ్గ పోలీసుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ