గుంటూరు లో ఓ మహిళ పై దాడికి పాల్పడిన ఘటన.పై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్
గుంటూరు లో ఓ మహిళ పై దాడికి పాల్పడిన ఘటన.పై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్
chandra babu


అమరావతి, 18 జూలై (హి.స.)

అమరావతి, గుంటూరులో ఓ మహిళపై దాడికి పాల్పడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనను వారు తీవ్రంగా ఖండించారు. గుంటూరు ఘటనలో బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే ఘటనలు అంగీకారయోగ్యం కావని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు పోస్టు పెట్టారు.

ఈ ఘటనలో నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న పార్టీ కార్యకర్తపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిపారు. రాజకీయ అనుబంధం పేరుతో ఎవరికీ రక్షణ ఉండబోదని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని తేల్చిచెప్పారు. భయం, పక్షపాతం లేకుండా చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఏపీ మహిళల గౌరవం, భద్రతకు తాము కట్టుబడి ఉంటామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande