
గుంటూరు, 18 జూలై (హి.స.)
: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఐ సత్యనారాయణపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయన్ని వీఆర్కు పంపుతూ గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు తీసుకోవడంలో సీఐ విఫలమయ్యారని నిర్ధరించారు. ఈ ఘటనను సీఎం చంద్రబాబు (Chandrababu) తీవ్రంగా పరిగణించారు. సమాజంలో ఇలాంటి ఘటనలకు తావులేదని కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సమగ్ర విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు.. కేసు నమోదు నుంచి, చర్యలు తీసుకోవడం వరకు సీఐ నిర్లక్ష్యం ప్రదర్శించారని నిర్ధరించి చర్యలు తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ