
హైదరాబాద్, 18 జూలై (హి.స.)
తెలంగాణలో నోటిఫికేషన్ కాదు
లూటీఫికేషన్ నడుస్తోందని, జిత్తుల మారిన కాంగ్రెస్ యువతను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు జాబుల క్యాలెండర్ వదిలేసి జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టారు. కొలువుల కుంభమేళా అని చెప్పి కుంభకోణాల కుంభమేళా చేపడుతున్నారని మండిపడ్డారు. ఇవాళ సరూర్ నగల్ో నిర్వహించిన బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సులో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేరిందా? అని ప్రశ్నించారు. 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నోటిఫికేషన్తో సహా నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుని రాహుల్ గాంధీకి జై కొడతానన్నారు. కాంగ్రెస్ చేసిన మహా ద్రోహాన్ని గుర్తు చేసుకోవడానికే ఈ సమావేశం అని జంగ్ సైరన్ మోగించడానికి యంగ్ తరంగ్ ఇక్కడికి తరలి వచ్చిందన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రపంచంలోనే అతిపెద్ద మోసం అని ఉద్యోగాలు అడిగితే యువతను ఉరికిచ్చి కొడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పోలీసు ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ తాగి చావమంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మించి మోసం చేయడంలో రేవంత్ రెడ్డి పీహెచ్ఎ చేశారని ఇప్పటివరకు ఒక లెక్క ఇకనుంచి మరో లెక్క అన్నారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి అబద్ధపు మాటలు చెప్పారని, రాహులు తెలుగు రాదు మా బాధలు అర్థం కావన్నారు. మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు. రాహుల్.. అశోక్ నగర్ లో మీరేం మాట్లాడారో గుర్తుందా అని ప్రశ్నించారు. ఈ యువతరానికి పొట్టు పొట్టు ఆకలి ఉందని కాంగ్రెస్కు ఘోరీ కడతామని యువత ఒట్లు పెట్టుకుంటున్నారన్నారు. నీ క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటుంది రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో అన్నారు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగ పత్రాలు ఇచ్చి రేవంత్ రెడ్డి క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ఉద్యోగాలపై సీఎం, మంత్రులు పూటకో మాట మాట్లాడుతున్నారన్నారు. భూములు, బూడిద, ఇసుక లూటిఫికేషన్ జరుగుతోందన్నారు. ప్రజలు హామీలపై ప్రశ్నిస్తే అవహేళనగా మాట్లాడుతున్నారు. అవమానాలు, అవహేళనలు ప్రజలు, యువత ఎప్పటికీ మర్చిపోరన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..