
ఆసిఫాబాద్, 18 జూలై (హి.స.)
రైతులకు సకాలంలో సాగునీరు
అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అధికారులు ఆదేశించారు. శనివారం ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టును ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించి వట్టివాగు కెనాల్ మరమ్మతు పనులను తొందరగా పూర్తి చేసి, వరి సాగు చేస్తున్న రైతులకు సకాలంలో సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నమోదవుతున్న వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు