డిసెంబర్ నాటికి అందుబాటులోకి 100 పడకల ఏరియా ఆసుపత్రి.. ఇల్లందు ఎమ్మెల్యే
డిసెంబర్ నాటికి అందుబాటులోకి 100 పడకల ఏరియా ఆసుపత్రి.. ఇల్లందు ఎమ్మెల్యే
MLA


భద్రాద్రి కొత్తగూడెం, 18 జూలై (హి.స.)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు

పట్టణంలోని జీకే కాలనీలో నిర్మాణంలో ఉన్న 100 పడకల నూతన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి భవనాన్ని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా టీజీఎంఐడీసీ అధికారులు ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం వేగంగా కొనసాగుతున్నాయని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించేలా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే కోరం కనకయ్య, డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబుతో కలిసి నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాల్లో ఎలాంటి రాజీ పడకుండా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి భవనాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande