దేశ అంతరిక్ష కలలకు చిరునామాగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి(update)
భారత్ తొలి ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగం ‘విక్రమ్-1’ విజయవంతంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ‘హైదరాబాద్ రైజింగ్.. తెలంగాణ రైజింగ్' అంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
Revanth reddy


హైదరాబాద్, 18 జూలై (హి.స.)భారత్ తొలి ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగం ‘విక్రమ్-1’ విజయవంతంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ‘హైదరాబాద్ రైజింగ్.. తెలంగాణ రైజింగ్' అంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. భారత్ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' విజయవంతమైన ప్రయోగమన్నారు. శ్రీహరికోట నుంచి విక్రమ్-1 నింగిలోకి దూసుకెళ్లిందని, హైదరాబాద్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ ఘన విజయం సాధించిందని తెలిపారు. భారత అంతరిక్ష రంగం మరో చారిత్రక మైలురాయిని చేరుకుందన్నారు.

దేశ అంతరిక్ష కలలకు చిరునామాగా తెలంగాణ నిలిచిందని సీఎం అన్నారు. హైదరాబాద్ ఇన్నోవేషన్ శక్తికి ప్రపంచ వేదికపై గుర్తింపు లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా స్కైరూట్ బృందానికి ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. విక్రమ్-1.. ప్రైవేట్ స్పేస్ రంగంలో భారత్ సత్తా చాటిందని కొనియాడారు. భవిష్యత్తు అంతరిక్ష ప్రయాణాలకు తెలంగాణ నుంచి బలమైన అడుగు పడిందని ఎక్స్లో సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande