
గన్నవరం, 18 జూలై (హి.స.)
: యూట్యూబర్ ప్రశ్న రావణ్ (బచ్చలకూరి జోసెఫ్) రిమాండ్ను గన్నవరం కోర్టు మరో 14 రోజులపాటు పొడిగించింది. ప్రస్తుతం నెల్లూరు జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న జోసెఫ్ రిమాండ్ గడువు నేటితో ముగియడంతో.. అతడిని అధికారులు వర్చువల్గా జడ్జి ఎదుట హాజరుపరిచారు. పలువురు ప్రముఖులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతోపాటు, సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేయడంతో అతడిని ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడి మొబైల్లో మావోయిస్టులను పొగుడుతూ చేసిన వీడియోలు ఉండటంతో దేశ ద్రోహం, ‘ఉపా’ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ