
హైదరాబాద్, 18 జూలై (హి.స.)కేంద్రంపై సంయుక్త ఒత్తిడికి దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఆయిల్ పామ్ రైతుల కోసం దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వాలని కోరారు. ప్రధాని మోదీని కలిసి ఆయిల్ పామ్ రైతుల సమస్యలు వినిపిద్దామన్నారు. ఆయిల్ పామ్కు కనీస హామీ ధర రూ.25 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. లేదంటే క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పునరుద్ధరించాలన్నారు.
దిగుమతి సుంకాల తగ్గింపుతో రైతులకు భారీ నష్టం వాటిల్లుతోందని మంత్రి తెలిపారు. దేశ ఆయిల్ పామ్ సాగులో 75 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాలదే అని చెప్పుకొచ్చారు. రైతులకు స్థిర ఆదాయం కోసం కేంద్రం తక్షణ జోక్యం అవసరమన్నారు. వంటనూనెల స్వయం సమృద్ధి లక్ష్యానికి రైతుల రక్షణ కీలకమన్నారు. ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాల కోసం దక్షిణాది రాష్ట్రాలు కలిసిరావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్