
విశాఖపట్నం, 18 జూలై (హి.స.)
, విశాఖపట్నం నగరంలోని గాజువాక పరిధిలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత యువతి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. మహిళలు, బాలికలపై జరిగే నేరాల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ