శ్రీశైల క్షేత్రంలో సీఎం రేవంత్ సతీమణి.. స్వామివారికి రుద్రాభిషేకం
శ్రీశైల క్షేత్రంలో సీఎం రేవంత్ సతీమణి.. స్వామివారికి రుద్రాభిషేకం
/cm-revanth-wife-geetha-reddy-visits-srisailam-along-with-d


శ్రీశైలం, 18 జూలై (హి.స.) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి, కుమార్తె శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డికి ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

అనంతరం శ్రీస్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకుని దర్శించుకున్నారు. దర్శనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ వేదపండితులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డికి, కుమార్తె వేద ఆశీర్వచనం చేయగా. ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు శ్రీస్వామి అమ్మవార్లకు చిత్రపటం, తీర్థ ప్రసాదాలను ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు అందజేశారు అనంతరం ఉయ్యాల సేవలో పాల్గొన్నారు. ఎంతో ప్రాముఖ్యమైన శ్రీశైల హిస్టరీ బుక్ కూడా ఈవో శ్రీనివాసరావు అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande