కడప జిల్లా నూతన డీఎంహెచ్ఓగా డాక్టర్ యుగంధర్ బాధ్యతల స్వీకరణ!
కడప జిల్లా నూతన డీఎంహెచ్ఓగా డాక్టర్ యుగంధర్ బాధ్యతల స్వీకరణ!
కడప జిల్లా నూతన డీఎంహెచ్ఓగా డాక్టర్ యుగంధర్ బాధ్యతల స్వీకరణ!


కడప, 18 జూలై (హి.స.) కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నందు డాక్టర్ యుగంధర్ గారు జిల్లా నూతన వైద్యారోగ్య శాఖాధికారి గా బాధ్యతలు చేపట్టారు. ఈయన కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా పని చేస్తూ బదిలీపైనా కడప జిల్లాకు విచ్చేసినారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో అన్ని ఆరోగ్య కార్యక్రమాలు అభివృధి జరగాలని, వంద శాతం లక్ష్యం దిశగా సిబ్బంది పనిచేసి, రాష్ట్రం లో జిల్లాను మొదటి స్థానం లో ఉంచాలని తెలిపారు.

జిల్లాలోని సిబ్బంది వారి విధివిధానాల ప్రకారం విధులు నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలు అందించాలని తెలియచేశారు. ముఖ్యంగా మాత శిశు సంరక్షణ సేవలు అందేలాగ చర్యలు తీసుకోవాలని. ఏ తల్లి జన్మ నిస్తూ మరణించకూడదు - ఏ బిడ్డ జన్మిస్తూ మరణించరాదు” అనే నినాదం తో ఆరోగ్య సిబ్బంది పనిచేయాలని తెలియచేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande