మతసామరస్యానికి ప్రతీక మస్తానయ్య ఉరుసు
మతసామరస్యానికి ప్రతీక మస్తానయ్య ఉరుసు
మస్తానయ్య ఉరుసు


గుంతకల్లు, 18 జూలై (హి.స.): అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం*లో ప్రసిద్ధిగాంచిన *హజరత్ సయ్యద్ మస్తాన్ వలి దర్గా 391వ ఉరుసు మహోత్సవం ఘనంగా జరిగింది.పట్టణంలోని పాతగుంతకల్లులో వెలసిన హజరత్ సయ్యద్షాఅలీ అక్బర్ ఉరుఫ్ హజరత్ మస్తాన్వలి ఉరుసు హిందూముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ పాల్గొన్నారు. దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి గుంతకల్లు నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని మొక్కులు చెల్లించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాల సామరస్యానికి గుంతకల్లు దర్గా ప్రతీక అని, ప్రజల సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గుంతకల్లు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు మాజీ పట్టణ అధ్యక్షులు బండారు ఆనంద్ సంజీవ్ నాయుడు, 11వ వార్డు ఇంచార్జి పరశురాముడు, ప్రభాకర్, సలీం, మద్దిలేటి, గుంతకల్లు మండలం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande