
అమరావతి, 19 జూలై (హి.స.)
పొదిలి: మండలంలోని గురువాయపాలెం గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున టమాటా లోడుతో వెళ్తున్న ఓ బొలెరో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చింత చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన డ్రైవర్ ఎస్కే అర్షద్ వాహనం లోపల ఇరుక్కుపోయి మృతి చెందినట్లు ఎస్సై ఎస్.రాజేష్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
వర్షం కోసం పోలేరమ్మకు ప్రత్యేక పూజలు
పొదిలి: మండలంలోని ఈగలపాడు గ్రామంలో ఆదివారం వర్షం కోసం మహిళలు మహిళలు పోలేరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేశారు . ఈ ఏడాది వర్షాలు పడకపోవడంతో పంటలు వేసుకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిపించాలని అమ్మవారిని మొక్కుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ