
అమరావతి, 19 జూలై (హి.స.)
రాష్ట్ర ఆరోగ్యశాఖను రెండు జాతీయ అవార్డులు వరించాయి. ఢిల్లీలో శుక్ర, శనివారాల్లో ఆయుష్మాన్ భారత్పై జరిగిన సమీక్షలో ఈ అవార్డులను జాతీయ ఆరోగ్య మిషన్ ప్రకటించింది. ‘ఆయుష్మాన్ వయో వందన’లో అత్యధిక కార్డులు నమోదు చేసినందుకు, అత్యధిక ఆరోగ్య రికార్డులను అనుసంధానించినందుకు అవార్డులు లభించాయి. దీనిపై అధికారులను మంత్రి సత్యకుమార్ అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ