
హైదరాబాద్, 19 జూలై (హి.స.)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తూ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ఉన్నత విద్య అభ్యసించేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో మధిర నియోజకవర్గ కేంద్రమైన మధిరలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం జరిగింది. మధిర నియోజకవర్గ కేంద్రానికి ఇంజనీరింగ్ కళాశాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల 18న ఇంజనీరింగ్ కళాశాల మంజూరు జీవో కాపీని జారీ చేశారు.
మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలం మోత్కుపల్లి క్రాస్ రోడ్ జగన్నాధపురం గ్రామంలో ఈ నెల 10న నిర్వహించిన రైతు ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సభలో మధిర శాసనసభ్యులు డిప్యూటీ సీఎం ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం కేంద్రమైన మధిరలో ఇంజనీరింగ్ కళాశాల అవసరం ఉందని ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరిక మేరకు ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ఆశీర్వాద సభలో ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఇంజనీరింగ్ కళాశాల మంజూరుకు ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కులు ఆశీర్వాద సభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తుందని, మధిరలో కళాశాల కోసం చేసిన విన్నపానికి తక్షణమే స్పందించి మధిర
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి కృషి చేస్తానని, ప్రత్యేకంగా విద్య వైద్య రంగాలు మౌలిక సదుపాయాల కల్పన పట్ల ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా డిప్యూటీ సీఎం ఈ ప్రాంత విద్యార్థులకు యువతకు ఉన్నత సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో ఇప్పటికే నూతనంగా అడ్వాన్సుడ్ ట్రైనింగ్ సెంటర్ ను, జవహర్ నాలెడ్జ్ సెంటర్ ను ఐటీ హబ్ ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలకు ఆమోదయోగ్యం లభించిన సంగతి తెలిసిందే అన్నారు.
ఇప్పటికే మధిరలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలతో పాటుగా డిప్లొమా వ్యవసాయ కళాశాల, పాలిటెక్నికల్ కళాశాల ఐటిఐ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ప్రాంతం విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసించేందుకు అవకాశాలు కల్పిస్తున్నారు.
లక్షల వెచ్చించి సాంకేతిక విద్యను అభ్యసించాలంటే అందరి వల్ల సాధ్యం కావడం లేదు. పేద మధ్యతరగతి బడుగు బలహీనవర్గాల కుటుంబాల నుండి విద్యార్థులు ఫీజులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఇంటర్మీడియట్ విద్యతోనే ఆగిపోయి, తాము అనుకున్న ఉన్నత విద్యను అభ్యసించలేక ఉన్నత లక్ష్యాలను చేరుకోలేక ఆవేదన పడుతున్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు ఇవ్వడంతో ఈ ప్రాంత విద్యార్థులకు యువతకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడంతో నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులు యువత ప్రత్యేకించి తల్లిదండ్రులు ఈ ప్రాంత విద్యావంతులు మేధావులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం,డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరతిగతిన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులో తీసుకొని రావాలని ప్రజలు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు