అటవీ—రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి: మంత్రి పొంగులేటి
అటవీ—రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి: మంత్రి పొంగులేటి
Minister


భద్రాద్రి కొత్తగూడెం, 19 జూలై (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో

భూముల రీ-సర్వే పనుల పురోగతి, అటవీ-రెవెన్యూ భూ సమస్యల పరిష్కారం, పోడు భూముల అంశం, పాల్వంచ శ్రీనివాసగుట్ట అభివృద్ధి పై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులతో ఒక సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూ రీ-సర్వే పనుల్లో జాప్యాన్ని ఉపేక్షించేది లేదన్నారు. జిల్లాలోని 70 గ్రామాల్లో చేపడుతున్న భూముల రీ-సర్వే పనుల పురోగతిని మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు.

ప్రస్తుతం జిల్లాలో 14 గ్రామాల్లో రీ-సర్వే పనులు కొనసాగుతుండగా, వాటిలో ఐదు గ్రామాల్లో పనులు విజయవంతంగా పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మిగిలిన అన్ని గ్రామాల్లో కూడా నిర్దేశిత గడువులోగా రీ-సర్వేను పూర్తి చేసేలా స్పష్టమైన కార్యాచరణను రూపొందించి అమలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పాల్వంచలో పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆలస్యానికి గల కారణాలను తక్షణమే గుర్తించి, వాటిని అధిగమించాలని స్పష్టం చేశారు. అటవీ-రెవెన్యూ భూ సమస్యల పరిష్కారంపై మంత్రి

ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలను పోలీసు శాఖ ద్వారా ముందస్తుగా గుర్తించాలని, ఆయా ప్రాంతాల్లో నెలకొన్న భూ వివాదాలను సామరస్యపూర్వకంగా, చట్టబద్ధంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు. సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, దీర్ఘకాలిక భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. జిల్లాలో కొత్తగా ఎలాంటి పోడు సాగు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మిగిలిన గ్రామాల్లో సైతం నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామని, రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖల సమన్వయంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా భూసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande