శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనంలో కీలక మార్పులు..
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనంలో కీలక మార్పులు..
శ్రీశైలం


శ్రీశైలం


శ్రీశైలం , 19 జూలై (హి.స.)నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ అధికారులు విరామ (స్పర్శ) దర్శన విధానంలో కీలక మార్పులు చేశారు. క్షేత్రానికి రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా నేటి (ఆదివారం) నుంచి కొత్త నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దేవస్థానం ఛైర్మన్ రమేశ్ నాయుడు, కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీనివాసరావు దర్శన మార్పులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

అధికారుల వివరాల ప్రకారం.. ఇకపై శని, ఆదివారాలు, సోమవారాల్లో ఉదయం వేళ మనమిత్ర వాట్సాప్, ఆన్లైన్ ద్వారా ముందస్తుగా టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే విరామ (స్పర్శ) దర్శనానికి అనుమతి ఉంటుంది. ప్రముఖులు స్వయంగా ఆలయానికి విచ్చేసిన సందర్భాల్లో ప్రాధాన్యత ఆధారంగా ఉదయం స్పర్శ దర్శనం కల్పించనున్నారు.

సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు ఉదయం వేళల్లో స్పర్శ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. వారికి అవకాశం ఉన్న మేరకు రాత్రి 9 గంటల సమయంలో మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

-

-

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande