నెల రోజుల్లో ఊహించని పరిణామాలు ఉంటాయి.. బీజేపీ ఇంచార్జ్ అభయ్ పాటిల్ సెన్సేషనల్ కామెంట్స్
నెల రోజుల్లో ఊహించని పరిణామాలు ఉంటాయి.. బీజేపీ ఇంచార్జ్ అభయ్ పాటిల్ సెన్సేషనల్ కామెంట్స్
BJP


హైదరాబాద్, 19 జూలై (హి.స.)

తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) ఆదేశాలతో స్టేట్ ఇంచార్జ్ అభయ్ పాటిల్ (Abhay Patil) రంగంలోకి దిగారు. వచ్చి రాగానే ఆయన పార్టీలోని ముఖ్య నాయకుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించి అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన మీడియాలో మాట్లాడుతూ.. రానున్న నెల రోజుల వ్యవధిలో తెలంగాణ బీజేపీలో ఊహించని, అత్యంత కీలకమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా తాము త్వరలోనే డోర్స్ ఓపెన్ చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీల నుంచి ఎవరెవరు బీజేపీలోకి వస్తారో అంతా చూస్తారని అభయ్ పాటిల్ కామెంట్ చేశారు.

అయితే, ఇటీవల పార్టీ సీనియర్ నేతలు బండి సంజయ్ (Bandi Sanjay), ఈటెల రాజేందర్ (Etala Rajender) మధ్య జరిగిన భేటీపై ప్రశ్నించగా.. అభియ్ పాటిల్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. వారిద్దరి సమావేశంలో ప్రత్యేకం కాదని అన్నారు. రాబోయే రోజుల్లో అలాంటి ఊహించని సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో మరెన్నో జరగుతాయని అన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం, తమ అధినేత నితిన్ నబీన్ ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు, వ్యూహాలతోనే తాను తెలంగాణలో క్షేత్రస్థాయిలో వర్క్ అవుట్ ప్రారంభించానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే పరమావధిగా పార్టీని భారీ స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లుగా అభయ్ పాటిల్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande