
కర్నూలు, 19 జూలై (హి.స.) ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బ్రహ్మర్శి సుభాష్ పత్రిజీ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. సుభాష్ పత్రిజీ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించబడ్డ బ్రహ్మశ్రీ పత్రిజీ సినిమాను నగరంలోని వెంకటేష్ థియేటర్ లో మాజీ రాజ్య సభ సభ్యులు టీ.జీ వెంకటేష్ తో కలిసి అయన తిలకించారు.
ఈ సందర్బంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ పత్రిజీ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి ధ్యాన మార్గాన్ని చూపిస్తూ ఉన్నతమైన ఆధ్యాత్మిక గురువుగా ఎదిగారన్నారు. తన జీవితాంతం ధ్యాన జగత్తును నిర్మించడమే లక్ష్యంగా కృషి చేశారన్నారు.
సుభాష్ పత్రిజీ గారి జీవిత ప్రయాణం, ఆయన సాధించిన ఆధ్యాత్మిక మార్పులు మరియు ధ్యాన జగత్తును సినిమాలో అద్భుతంగా చూపించారని ఆయన తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV