ఢిల్లీలో తెల్లవారుజామున తేలికపాటి వర్షం: తగ్గిన ఉష్ణోగ్రతలు, కొనసాగుతున్న గాలిలో తేమ
ఢిల్లీలో తెల్లవారుజామున తేలికపాటి వర్షం: తగ్గిన ఉష్ణోగ్రతలు, కొనసాగుతున్న గాలిలో తేమ
delhi


ఢిల్లీ, 02 జూలై (హి.స.)

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం తెల్లవారుజామున ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది. ఇది నగరవాసులకు తీవ్రమైన ఎండ వేడిమి నుండి కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. ఉదయం సమయంలో నగరంలో 28 నుండి 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వగా, గాలిలో తేమ శాతం (హ్యుమిడిటీ) మాత్రం 95 శాతం వరకు అత్యధికంగా కొనసాగుతోంది. ఇవాళ గరిష్ట ఉష్ణోగ్రతలు 32 నుండి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని, ఈదురు గాలులతో కూడిన మరికొంత వర్షం పడొచ్చని వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.ఈ వర్షం కారణంగా ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ (AQI) 79గా నమోదై 'మధ్యస్థం' కేటగిరీకి చేరింది. రాబోయే రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్ మరియు ఉత్తర ప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. పశ్చిమ, మధ్య భారత దేశంలోని పలు ప్రాంతాలకు ఇప్పటికే వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande