
అమరావతి, 21 జూలై (హి.స.)
బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా ఆండీ బర్న్హామ్ (56) బాధ్యతలు చేపట్టగా.. భారత మూలాలున్న ఇద్దరికి ఆయన క్యాబినెట్లో మంత్రి పదవులు దక్కాయి. ఒకరు కనిష్క నారాయణ్ కాగా.. మరొకరు లీసా నాండీ. వేల్స్ నుంచి ఎంపీగా గెలిచిన కనిష్క యూకే తొలి ఏఐ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కీర్స్టార్మర్ ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన లీసా నాండీకి మరోసారి అదే పదవి దక్కింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ