వరి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ కె. హరిత
వరి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ కె. హరిత
Collector


ఆసిఫాబాద్, 20 ఆగస్టు (హి.స.)

వరి ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం. డేవిడ్, కాగజ్నగర్ ఆర్డీవో చెన్నూరి కిష్టయ్యలతో కలిసి పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, తూనికలు-కొలతలు, సెర్ప్ శాఖల అధికారులతో ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 2026 ఖరీఫ్ సీజన్లో 23 వేల 934 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తు ప్రాంతాల్లో ఉండి, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా స్థలాలను గుర్తించాలని తెలిపారు. గోనె సంచుల లభ్యత, తూకం యంత్రాలు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, డ్రయర్లు, టార్పాలిన్ కవర్లు అవసరమైన మేరకు ప్రభుత్వానికి ఇండెంట్ సమర్పించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande