
హైదరాబాద్, 20 ఆగస్టు (హి.స.)
నగరవాసులకు మరియు పర్యాటకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న సంజీవయ్య పార్కు సిద్ధమైంది. పార్కులో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక రోజువారీ మల్టీమీడియా లేజర్ షో, వాటర్ స్క్రీన్ మరియు మ్యూజికల్ ఫౌంటెన్ ప్రదర్శనలను అధికారులు గురువారం ఉదయం అధికారికంగా అందుబాటులోకి తెచ్చారు రోజువారీ మల్టీమీడియా లేజర్ షో, వాటర్ స్క్రీన్ మరియు మ్యూజికల్ ఫౌంటెన్ ప్రదర్శనలను అధికారులు గురువారం ఉదయం అధికారికంగా అందుబాటులోకి తెచ్చారు. ప్రతిరోజు సాయంత్రం వేళల్లో సందర్శకుల కోసం ఈ ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించబడతాయి. హుస్సేన్ సాగర్ అందాలను మరింత పెంచేలా, సాంకేతిక హంగులతో కూడిన ఈ సరికొత్త వాటర్ ఫౌంటెన్ షో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుందని పర్యాటక శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi