తిరుమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల కదలికలను పసిగట్టేందుకు రోబోలను రంగంలోకి దించనున్న టీటీడీ
తిరుమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల కదలికలను పసిగట్టేందుకు రోబోలను రంగంలోకి దించనున్న టీటీడీ
ttd


తిరుపతి; తిరుమల,21 ఆగస్టు (హి.స.)

: తిరుమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలను పసిగట్టేందుకు, భక్తులకు మరింత పటిష్ఠ భద్రత కల్పించేందుకు తితిదే రోబోలను రంగంలోకి దించుతోంది. మనుషులు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉండే కొండకోనల్లో సునాయాసంగా తిరుగుతూ, రియల్ టైమ్ నిఘా ఉంచే ‘క్వాడ్రుపెడ్ రోబోట్’ (నాలుగు కాళ్ల రోబో డాగ్)ను ప్రయోగాత్మకంగా వినియోగించాలని నిర్ణయించింది. తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద ఈ ఆధునిక రోబో పనితీరును తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరి అధికారులతో కలిసి పరిశీలించారు. రోబో పనితీరు అద్భుతంగా ఉందని ఆయన కితాబిచ్చారు. చెన్నైకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ దీన్ని రూపొందించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande