CM అమెరికా పర్యటన రద్దు.. విదేశాంగ శాఖ అనుమతి నిరాకరణ
CM అమెరికా పర్యటన రద్దు.. విదేశాంగ శాఖ అనుమతి నిరాకరణ
Cm


హైదరాబాద్, 21 ఆగస్టు (హి.స.)

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం షెడ్యూల్ ఉన్న అమెరికా (US) పర్యటన రద్దయింది. బ్రిటన్ (UK) పర్యటనను విజయవంతంగా ముగించుకున్న సీఎం, ఈనెల 23న లండన్ నుంచి నేరుగా హైదరాబాద్కు చేరుకోనున్నారు. రద్దయిన ఈ పర్యటనను వచ్చే నెలలో తిరిగి చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా లండన్, అమెరికాలలో తెలంగాణ రైజింగ్ (Telangana Rising) పేరుతో ప్రతినిధుల సమావేశాలు నిర్వహించడానికి ప్రొటోకాల్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. అయితే, చివరి నిమిషంలో కేంద్ర విదేశాంగ శాఖ కేవలం యూకేలో నిర్వహించే సమావేశాలకు మాత్రమే అనుమతిని ఇచ్చింది. అమెరికాలో నిర్వహించాల్సిన సదస్సులకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో, సీఎం రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి ప్రయాణాన్ని కుదించుకుని రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు. వాస్తవానికి అమెరికాలోని ప్రముఖ నగరాలైన బోస్టన్, న్యూయార్క్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి సర్వం సిద్ధమైంది. అక్కడి పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) మినిట్-టు-మినిట్ షెడ్యూల్ను పర్యవేక్షిస్తూ ఏర్పాట్లను పూర్తి చేసింది. అయితే, చివరి నిమిషంలో కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వకపోవడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande