తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సవతుల పోరు నడుస్తోంది.. సీపీఐ నారాయణ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సవతుల పోరు నడుస్తోంది.. సీపీఐ నారాయణ
Cpi


హైదరాబాద్, 21 ఆగస్టు (హి.స.)

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నపరిస్థితులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సవతుల పోరు నడుస్తోందని అన్నారు. కాంగ్రెస్ నేతల అంతర్గత కలహాల వల్ల రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటోందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి నిక్కచ్చిగా వ్యవహరిస్తూ, ఏ తప్పూ చేయకుండా ఉంటేనే మంత్రులు, కిందిస్థాయి అధికారుల్లో భయం ఉంటుందని చెప్పారు. 22ఏ భూముల నిబంధనను కొందరు దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంలో సీపీఐ భాగస్వామి కాదని, ఎన్నికలలో కేవలం సీట్ల సర్దుబాటు మాత్రమే చేసుకున్నామని చెప్పారు. అంతే కాకుండా తమ సూచనలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో పలువురు నేతల మధ్య విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల పరకాల ఎమ్మెల్యే టికెట్ తనదే అంటూ కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో పార్టీలో కుదుపులు మొదలయ్యాయి. అంతేకాకుండా ఆమె సీఎం రేవంత్ పైనే నేరుగా అవినీతి ఆరోపణలు, విమర్శలు చేశారు. మరోవైపు తుంతుర్తిలో రాజగోపాల్ రెడ్డి, మందుల సామేలు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వీటితో పాటు వనపర్తి కాంగ్రెస్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్సెస్ కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి మధ్య వార్ నడుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande