
విజయవాడ, :, 21 ఆగస్టు (హి.స.)
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరలక్ష్మీ దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అమ్మవారికి దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా దుర్గమ్మ ఆలయంతోపాటు రాష్ట్రంలో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే కొన్ని ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ