అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ ను మంత్రి మందపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు
అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ ను మంత్రి మందపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు
అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ ను మంత్రి మందపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు


కాకినాడ, 21 ఆగస్టు (హి.స.)

,అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్లో ప్రయాణికులతో మాట్లాడారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళా ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. స్త్రీ శక్తి పథకం అమలుపై మహిళా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతోందని మహిళలు ప్రశంసలు కురిపించారు. అన్నవరం బస్టాండ్లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపైనా మంత్రి ఆరా తీశారు.

ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు. అనంతరం అన్నవరం ఆర్టీసీ క్యాంటీన్ను సందర్శించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో కలిసి అల్పాహారం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయంగా మాట్లాడిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande