ఆర్డీవోపై మంత్రి జూపల్లి ఆగ్రహం..
ఆర్డీవోపై మంత్రి జూపల్లి ఆగ్రహం..
Minister


నాగర్ కర్నూల్, 21 ఆగస్టు (హి.స.) నాగర్ కర్నూలు జిల్లా లోని పెంట్లవెల్లి మండల రెవెన్యూ కార్యాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రెవెన్యూ వినతులపై కార్యాలయంలో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. మండల రెవెన్యూ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్తున్న అన్ని ఫైల్ లను జాప్యం చేస్తుండడంపై కొల్లాపూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి బన్సిలాల్ తో మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోని అర్జీలను మంత్రి జూపల్లి పరిశీలించారు. కార్యాలయంలో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండడం గమనించిన మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి స్వయంగా టాయిలెట్లను నీళ్లు పోసి శుభ్రం చేసి అధికారులకు కనివిప్పు కలిగించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande