సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు చర్యలు: సీఎం చంద్రబాబు ఆదేశాలు
సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు చర్యలు: సీఎం చంద్రబాబు ఆదేశాలు
Chandrababu Naidu(file)


అమరావతి 21 ఆగస్టు (హి.స.)

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది. వాతావరణం అకస్మాత్తుగా మారడంతో సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడానికి కోస్ట్ గార్డ్, నౌకాదళం మరియు హెలికాప్టర్ల సహాయాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రెస్క్యూ ఆపరేషన్‌పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

మత్స్యకారులను కాపాడేందుకు అందుబాటులో ఉన్న అన్ని రకాల అధునాతన మార్గాలను, సాంకేతికతను వినియోగించాలని సీఎం ఆదేశించారు. తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు నిరంతరం మత్స్యకార కుటుంబాలతో అందుబాటులో ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో మత్స్యకారులు తప్పనిసరిగా జీపీఎస్ మరియు రక్షణ పరికరాలను తీసుకెళ్లేలా అవగాహన కల్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్‌ను బలోపేతం చేస్తామని మత్స్యకార శాఖ మంత్రి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande