వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్-1 ట్రయల్ రన్ సక్సెస్: ప్రకాశం జిల్లాకు తీరనున్న తాగునీటి కష్టాలు
వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్-1 ట్రయల్ రన్ సక్సెస్: ప్రకాశం జిల్లాకు తీరనున్న తాగునీటి కష్టాలు
వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్-1 ట్రయల్ రన్ సక్సెస్: ప్రకాశం జిల్లాకు తీరనున్న తాగునీటి కష్టాలు


నెల్లూరు, 21 ఆగస్టు (హి.స.)

ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల కరవు ప్రాంతాలకు వరప్రదాయినిగా మారనున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఒకటో సొరంగం (Tunnel-1) ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. శ్రీశైలం జలాశయం నుండి కృష్ణమ్మ జలాలు విజయవంతంగా సొరంగం గుండా ప్రవహించి ప్రాజెక్ట్ పరిధిలోకి చేరుకున్నాయి. దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్ పనులను ప్రస్తుత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసింది.

ఈ ఒకటో సొరంగం ద్వారా ప్రకాశం జిల్లాలోని కరవు పీడిత ప్రాంతాలకు తాగునీరు మరియు సాగునీరు అందనుంది. ముఖ్యంగా ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. రెండవ సొరంగం పనులను కూడా వేగవంతం చేసి, రాబోయే కొన్ని నెలల్లోనే ప్రాజెక్ట్‌ను పూర్తి స్థాయిలో జాతికి అంకితం చేస్తామని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఈ ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు మరియు రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande